కరోనా మూడవ వేవ్ విజరుంభిస్తున్నందున దీని నియంత్రణ కొసం ప్రతి ఒక్కరు వాక్సినేషన్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల…

కరోనా మూడవ వేవ్ విజరుంభిస్తున్నందున దీని నియంత్రణ కొసం ప్రతి ఒక్కరు వాక్సినేషన్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు.

గురువారం పెద్దేముల్ మండలం, మంబాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిఖిల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు వాక్సినేషన్ వేయించుకొని వారు వెంటనే వాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. వాక్సినేషన్ వేయించుకోవాడం వల్ల కరోనా తీవ్రతను తగ్గిస్తుందని తెలిపారు. అలాగే మొదటి డోజ్ తర్వాత రెండవ డిజ్ కు అర్హులైన వారందరు రెండవ డోజ్ వేయించుకోవాలని సూచించారు.
15 సంవత్సరాలు గల టీనేజర్లను గుర్తించి వారందరికీ వాక్సినేషన్ చేయాలని సూచించారు. గ్రామంలో వాక్సినేషన్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే పక్కడబందిగా నిర్వహించాలన్నారు. జ్వరం, ఒంటినొప్పులతో బాధపడే వారిని గుర్తించి వారికి హోమ్ ఐసొలేషన్ మెడికల్ కిట్స్ అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి తుకారం, వైద్య సిబ్బంది RI రాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post