కరోనా మూడో దశ లో కేసు లు పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని , కరోనా చికిత్సకు రోగులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రిక ప్రకటన                                             తేది:12-01-2022

కరోనా మూడో దశ లో కేసు లు పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని , కరోనా చికిత్సకు రోగులకు  అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

బుధవారం జిల్లాలోని గోనుపాడు గ్రామం లోని కస్తుర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలెషన్ సెంటర్ ను  పరిశీలించారు. కరోనా మూడో దశ వస్తున్నందున ప్రజలు  కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,  ఐసోలెషన్ సెంటర్ లో విధిగా సానిటేషన్ చేయించాలని, పరిసరాలు  పరిశుబ్రంగా ఉంచుకోవాలని అన్నారు. రోగులకు ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలని తెలిపారు.  ఐసోలెషన్ సెంటర్  లో ఎన్ని బెడ్ లు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఐసోలేషన్ సెంటర్ లో అన్ని సౌకర్యాలు ముందుగానే ఏర్పాటు చేయాలనీ, సెంటర్ లో కరోనా రోగులకు తగిన ఆహరం, మందులు, వైద్య చికిత్సలు అందించేందుకు సిద్దంగా ఉండాలని  సంబంధిత అధికారులకు ఆదేశించారు.

అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో కోవిడ్ వార్డ్ ను పరిశీలించారు. కోవిడ్ వార్డ్ లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ, ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కోవిడ్ వార్డ్ లో సానిటేషన్ బాగా చేయించాలని, ఆసుపత్రి ఆవరణ అంత సానిటేషన్ చేయించి పరిసరాలు పరిశుబ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆసుపత్రి లో టి.ఎస్.ఎం.ఐ .డి.సి వారి అద్వర్యం లో ఆక్సిజన్ పైప్ లైన్లను  పరిశీలించారు. రోగులకు ఎలాంటి ఆహరం ఇస్తారని, వారికి చేసే చికిత్స గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమం లో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, ఆర్.డి.ఓ రాములు, జిల్లా వైద్యాధికారి చందు నాయక్, సుపరిటెన్డెంట్ కిషోర్ కుమార్,  టి.ఎస్.ఎం.ఐ.డి.సి రాఘవ, కస్తుర్బా విద్యాలయ సుజాత, ఎం.ఆర్.ఓ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల ద్వారా  జారీ చేయడమైనది.

Share This Post