కరోనా రోగులకు వైద్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొత్త పెల్లి పీ హెచ్ సి లో వైద్య సిబ్బందికి బూస్టర్ డోస్ లను ప్రారంభించిన మంత్రి

View Post

పత్రికా ప్రకటన.                                                                                                                              తేదీ: 10-1-2022

c

కరోనా రోగులకు వైద్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివి

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

కొత్త పెల్లి పీ హెచ్ సి లో వైద్య సిబ్బందికి బూస్టర్ డోస్ లను ప్రారంభించిన మంత్రి

                                                                                0000

     కరోన రోగులకు వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి అందించిన సేవలు వెలకట్టలేని వని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

     సోమవారం కొత్తపల్లి మండల  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బందికి బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ టీకా  ముందు జాగ్రత్త ( బూస్టర్) డోసులను సోమవారం నుంచి ప్రభుత్వం  ప్రారంభించిందని తెలిపారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకొని 9 నెలలు పూర్తయిన వారు బూస్టర్ డోసు కు అర్హులు అని అన్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బంది, 60 ఏళ్లు పైబడి ఉన్నవారికి బూస్టర్ డోస్ అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి వ్యాధులు లేని 60 ఎండ్లు పై బడిన వారికి వచ్చే నెల నుంచి ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ అందిస్తామని మంత్రి తెలిపారు.  కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. 15 నుంచి 18 ఎండ్ల వయసు గలవారు తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు.

     ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జూవేరియా, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, పీ ఎచ్ సి వైద్యులు రమేష్, వంశీ, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.

కరోనా రోగులకు వైద్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివి
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కొత్త పెల్లి పీ హెచ్ సి లో వైద్య సిబ్బందికి బూస్టర్ డోస్ లను ప్రారంభించిన మంత్రి

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post