కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలకు పిఎం కేర్స్ కింద ఆర్థిక సహాయం….

కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలకు పిఎం కేర్స్ కింద ఆర్థిక సహాయం….

ప్రచురణార్థం

కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలకు పిఎం కేర్స్ కింద ఆర్థిక సహాయం…..

మహబూబాబాద్ మే-30:

కరోన మహమ్మారి కారణంగా దేశంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకము ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

సోమవారం దేశంలోనీ అన్ని జిల్లాల కలెక్టర్ల తో పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం పై ప్రధానమంత్రి వీడియో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజ్ఞా సమావేశం నుండి ఈ వీడియో సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.

వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడారు.

మన భారతదేశంలో కొవిడ్ ద్వారా చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోగా, మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు బాలలు తమ తల్లిదండ్రులను కోల్పోయారని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ శశాంక తెలియజేశారు.

ముగ్గురు లబ్ధిదారులకు 10 లక్షలు జమ అయిన పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లను ,5 లక్షల విలువైన హెల్త్ కార్డ్ లను , ప్రధానమంత్రి లబ్ధిదారులకు పంపిన లేఖ, పీ యం కేర్ సర్టిఫికేట్ లను లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ బాలల తో మాట్లాడుతూ, అధైర్య పడకూడదని మంచిగా చదువుకొని, ఉన్నత లక్ష్యాలను సాధించడానికి మీరు సంసిద్ధం కావాలని, కెరియర్ కౌన్సిలింగ్ ద్వారా మీ లక్ష్యాలను ఎంచుకొని,మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని,మీకు ప్రభుత్వo అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. వారికి ఎటువంటి సహాయం కావాలన్నా నేరుగా తనతో మాట్లాడవచ్చని వారికి తెలిజేసి , వారిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులను ఆదేశించారు.

పి ఎం కేర్ పథకం కింద 10 లక్షల రూపాయలను జిల్లా కలెక్టర్ల, లబ్ధిదారుల పోస్టాఫీసు జాయింట్ అకౌంట్ కు జమ అయిందని ,ఈ మొత్తం లబ్ధిదారులకు 23 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతినెల వడ్డీ కలుపుకొని 13 లక్షల 50 రూపాయలు అందుతుందని, ఈ మొత్తం వారి అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని తెలియజేశారు. అదేవిధంగా వారి యొక్క ఆరోగ్య రక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కలిగిన హెల్త్ కార్డు ఉపయోగ పడుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనినా, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై , డి ఆర్ డి ఓ సన్యసయ్య ,జడ్పీ సిఈవో రమాదేవి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నాగవాని, సభ్యులు అశోక్, డేవిడ్ , బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ జ్యోతి, బాలల సంరక్షణ అధికారులు వీరన్న, నరేష్, సిబ్బంది రమేష్, వెంకన్న, రఘుపతి, వెంకటేష్, లబ్ధిదారుల సంరక్షకులు పాల్గొన్నారు.

Share This Post