కరోనా వాక్సిన్ చాలా సురక్షిత మని అపోహలు వీడి అర్హులైన ప్రతి ఒక్కరు బాధ్యతగా  వాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. 

సోమవారం కలెక్టరేట్ నుండి వాక్సిన్ ప్రక్రియపై వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్ లు,  తహసీల్దార్లు, ఎంపిడిఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు,  పుణ్య క్షేత్రాలుకు వచ్చే భక్తులుకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక వాక్సిన్  క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. వారం రోజుల్లో వాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయుటపై మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. నూరుశాతం వాక్సిన్ జరిగినట్లు  అన్ని మండలాలను ప్రకటించాలని చెప్పారు. వాక్సిన్ తీసుకోని వ్యక్తుల లైన్ లిస్ట్ ఆధారంగా ముమ్మరం చేయాలని చెప్పారు. ప్రతి ఇల్లు సర్వే చేయాలని చెప్పారు.  పట్టణ ప్రాంతాల్లో వాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయుటకు మొబైల్ వాహనాలు వినియోగించాలని చెప్పారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయుటకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. వాక్సిన్ వేయాల్సిన లక్ష్యం ప్రకారం ప్రతి రోజు లక్ష్యాన్ని నిర్దేశించుకుని తహసీల్దార్లు, ఎంపిడిఓలు ప్రజలను మొబలైజ్ చేయాలని చెప్పారు.   వాక్సిన్ ప్రక్రియ నత్త నడకన సాగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.  పట్టణ ప్రాంతాల్లో ప్రతి వార్డులో  వాక్సిన్ టీం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ లకు సూచించారు. రద్దీ ప్రాంతాల్లో వాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. విద్యార్థులకు కళాశాలలో వాక్సిన్ కార్యక్రమం చేపట్టాలని చెప్పారు. జిల్లాలో 59 వేల మందికి మొదటి విడత వాక్సిన్ వేయాల్సి ఉన్నట్లు చెప్పారు .

ఈ టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్యాధికారి శిరీష, మున్సిపల్ కమిషనర్లు, తసీల్దారులు, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post