వ్యాక్సినేషన్ ద్వారా కరోనా వైరస్ నియంత్రణ సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పాటు కుమ్మరికుంట చెరువు మినీ ట్యాంక్ బండ్‌ను, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సoదర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సo॥లు నిండి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సినేషన్ ద్వారా వైరస్ నియంత్రణ సాధ్యపడుతుందని తెలిపారు. సoబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి 100 శాతం పూర్తయ్యే విధంగా చర్యలు తీనుకోవాలని అన్నారు. అనంతరం పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి రోడ్డు పనులలో నాణ్యతా ప్రమాణాలు తప్పనినరిగా పాటించాలని సoబంధిత అధికారులు, గుత్తేదారును ఆదేశించారు. తహశిల్దార్ కార్యాలయాన్ని సoదర్శిoచి ధరణి సoబంధిత సమన్యలపై విచారించి, రిజిస్టేషన్ పనులతో పాటు రికార్డులను పరిశీలించి తహశిల్దార్, సిబ్బందికి తగు నూచనలు, నలహాలు చేశారు. పురపాలక శాఖకు అప్పగించవలనిన రెవెన్యూ శాఖ పరిధిలోని భూములను స్వాధీనపర్బాలని అన్నారు. అనంతరం స్టేడియం పనులను పరిశీలించి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అందించాలని గుత్తేదారును ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల తహశిల్దార్ దేశ్‌పాండే, మున్సిపల్ కమీషనర్ ఖాజామొయినొద్దీన్, చైర్‌పర్సన్ అర్చనా.
రాంలాల్ గిల్డా, వైన్ చైర్మన్ నవాజుద్దీన్, నంబంధిత శాఖల అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.