కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం….1
ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించాలి :: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి, సెప్టెంబర్ 16
: గ్రామాలలో ,పట్టణాల్లో ప్రతిఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పేర్కోన్నారు. శుక్రవారం పెద్దపల్లి మున్సిపాలిటీ లోని ఆర్.ఆర్ గార్డెన్స్, పాలకుర్తి మండలం పాలకుర్తి, జయ్యారం, గ్రామాలలో కోవిడ్ కేంద్రాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. పెద్దపల్లి ఆర్ ఆర్ గార్డెన్స్ లో 10,11 వార్డుల కోసం ఏర్పాటు చేసిన 2 క్యాంపులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పాలకుర్తి మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామంలో ప్రతి ఇంటింటికి వార్డుల వారిగా వ్యాక్సిన్ సర్వే నిర్వహించి వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాక్సిన్ పై అపోహలు ఉన్నవారికి అవగాహనను కల్పించి వారు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కోన్నారు వ్యాక్సిన్ కొరకు కేంద్రాల వద్దకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా టెంటు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. వ్యాక్సిన్ కొరకు కేంద్రాల వద్దకు ప్రజలు ఎక్కువమంది వచ్చినట్లయితే, ఇబ్బందులు కలుగకుండా రిజిస్ట్రేషన్ కొరకు ఇతర సిబ్బందిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో10 రోజులలో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తికావాలని అధికారులను కలెక్టర్ అదేశించారు పాలకుర్తి గ్రామం లో వ్యాక్సిన్ కేంద్రం సమీపంలో ఉన్న పాఠశాలలో పిల్లలతో ముచ్చటిస్తూ, విద్యాభోదనను గురించి, మధ్యాహ్నం గురించి విచారించారు. అనంతరం సానిటేషన్ పనులను పరిశీలించి గ్రామాలు చెత్తరహితంగా ఉండాలని, సానిటేషన్ సిబ్బందితో శుభ్రం చేయించాలని పేర్కోన్నారు.
అనంతరం జయ్యారం గ్రామంలో పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ పిల్లలతో ముచ్చటించారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెత్తను తోలగించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. జిల్లాలోని ఆశా వర్కర్లు ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ స్టీకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ పర్యటన లో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తిరుపతి రావు, సర్పంచులు, ఎం.పి.పిలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్దపల్లి చే జారీ చేయనైనది.

Share This Post