కరోనా వ్యాక్సినేషన్ పై రివ్యూ నిర్వహించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి

ప్రచురణార్థం —1
ఉద్యమంలా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలి:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
• 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలి
• రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి
• 222 బృందాల ద్వారా జిల్లాలో వ్యాక్సినేషన్ నిర్వహణ
• ప్రతి ఇంటి ముందు వ్యాక్సినేషన్ సంబంధించి స్టికర్ ఏర్పాటు చేయాలి
• ప్రజలందరు వ్యాక్సినేషన్ తీసుకునేలా ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలి
• జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్ద పల్లి, సెప్టెంబర్ 19 :-
. జిల్లాలో ఉద్యమంలా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ పై మంత్రి ఆదివారం ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వీడీయో కాన్పరెన్సు ద్వారా సమీక్షించారు. సీఎం కేసిఆర్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసామని మంత్రి తెలిపారు గ్రామీణ ప్రాంతాలో వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కోరారు. కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా సీఎం కేసిఆర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం చేయడంలో ప్రజాప్రతినిధలు కీలక పాత్ర పోషించాలని మంత్రి సూచించారు అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి చివరి మనిషి వరకు వ్యాక్సిన్ అందించాలని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామం మరియు వార్డు పరిధిలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాల నిర్వహణ పై అవగాహన కల్పించాలని, ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తరువాత కరోనా వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయని, వ్యాక్సినేషన్ అనంతరం కరోనా వచ్చినప్పటికి ప్రాణాలకు ఎలాంటి అపాయం ఉండదని, ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్లాలని మంత్రి ఆదేశించారు పెద్దపల్లి జిల్లాలో గర్భవతులైన స్త్రీలు సైతం వ్యాక్సిన్ తీసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని, ప్రజలలో ఉన్న అపోహలను దూరం చేయాలని, డాక్టర్ బృందాలతో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రత్యేక క్యాంపుల వద్ద అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి 3 వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఒక డాక్టర్ పర్యవేక్షించే ఎలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ అందించడం కోసం నిర్విరామంగా కృషి చేసిన వైద్యాధికారులు, వివిధ శాఖల సిబ్బంది ని మంత్రి అభినందిస్తూ, ఈ స్పూర్తి ఇదే విధంగా కొనసాగించాలని తెలిపారు

    సమావేశంలో  పాల్గోన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ  మాట్లాడుతూ  జిల్లాలో  100 శాతం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందించేందుకు 222 (118 పట్టణ, 104 గ్రామీణ) బృందాలతో  ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసామని  తెలిపారు.  జిల్లాలో దాదాపు 5.5 లక్షల మందికి పైగా  ప్రజలు 18 సంవత్సరాల పై వయస్సు వారు ఉన్నారని, వీరిలో 451138 మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసామని తెలిపారు.   సెప్టెంబర్ 17 నుంచి నిర్వహిస్తున్న  ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ప్రతిరోజు 13 వేల మందికి వ్యాక్సినేషన్ అందిస్తున్నామని  తెలిపారు.   సబ్ సెంటర్ పరిధిలో ఉన్న గ్రామాలో  షెడ్యూల్ ప్రకారం  ప్రత్యేక వ్యాక్సిన్ క్యాంపులు నిర్వహిస్తామని,   సదరు షెడ్యుల్ సంబంధిత సమాచారం స్థానిక ప్రజాప్రతినిధులందరికి అందించాలని కలెక్టర్ సూచించారు.   జిల్లాలో  ఐకేపి, అంగన్ వాడి , ఆశాలతో బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటికి  తిరిగి  వ్యాక్సినేషన్ కాని వారిని గుర్తిస్తున్నామని,  ప్రతి ఇంటి  పై వ్యాక్సినేషన్  స్టికర్ అతికించాలని  కలెక్టర్ సూచించారు. 

జడ్పీ చైర్మన్ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్,జిల్లా వైద్యశాఖ అధికారి డా.ప్రమోద్ కుమార్ ,రామగుండం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ,  జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు,సంబంధిత అధికారులు  తదితరులు ఈ వీడియో  కాన్పరెన్సులో  పాల్గోన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి గారిచే జారీచేయబడినది.

Share This Post