కరోనా వ్యాక్సినేషన్ సేవలకై మొబైల్ నెంబర్ ఏర్పాటు:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, నవంబర్ 02 : జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ సేవల కోసం జిల్లా కేంద్రంలో 8247847692 తో మొబైల్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాక్సినేషన్ కేంద్రాలకు రాలేనీ వారు, అనారోగ్యంతో బాధ పడుతున్నవారు, వ్యాక్సిన్ తీసుకొనేందుకు ఎలాంటి ఇబ్బందులూ ఉన్న వారైనా ఈ మొబైల్ నెంబర్ 8247847692 కు కాల్ చేస్తే వైద్య సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి వ్యాక్సిన్ ఇస్తారని ఆయన అన్నారు. కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని, వ్యాక్సిన్ సురక్షితమని, ఎలాంటి భయాలు, అపోహలు వద్దని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకొనని వారు ఎవరైనా ఈ మొబైల్ నెంబర్ ఏర్పాటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Share This Post