*కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి నూరు శాతం వ్యాక్సిన్ వేయించాలి;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

 తేది 27.10.2021,నల్గొండ           *కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి నూరు శాతం  వ్యాక్సిన్ వేయించాలి;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*                          *ఎం. పి.డి.ఓ.లు,ఎం.పి.ఓ.లు,సి.డి.పి.ఓ.లు,పి.ఆర్.ఏ.ఈ. లు,పంచాయతీ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ వీడియా కాన్ఫరెన్స్,కోవిడ్ వ్యాక్సినేషన్, ఉపాది హామీ పనులు,పల్లె ప్రకృతి వనం లు,బృహత్ పల్లె ప్రకృతి వనం లు, వైకుంఠ దామంలు, ప్రగతి,నర్సరీల పై సమీక్ష*                    కరోనా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని,అన్ని శాఖల అధికారులు కలిసి బాధ్యత గా 18 సం. లు నిండిన ప్రతి ఒక్కరికి నూరు శాతం వ్యాక్సినేషన్ వేయించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.                   . బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఎంపీడీవో, ఎంపీవో లు,పంచాయతే కార్యదర్శులు,సి.డి.పి.ఓ.లు, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్,వైకుంఠ దామం లు నిర్మాణ ప్రగతి,నర్సరీలు ఏర్పాటు తదితర విషయాల పై సమీక్షించి పలు సూచనలు చేశారు..ఇటీవల ఇతర దేశాలలో రష్యా,జర్మనీ, యు. కె.,చైనా దేశాల్లో  కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున, అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి,అందరూ కలిసి బాధ్యతగా మండల, గ్రామ స్థాయి బృందాలు వ్యాక్సిన్ వేసుకొని వారికి వ్యాక్సిన్ వేయించాలని అన్నారు. వారంరోజుల్లోగా అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందించవలసిందిగా మంగళవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్    కుమార్ ఆదేశించారని తెలిపారు.ఆరోగ్య శాఖ శాఖ,ఏ.ఎన్. యం., ఆశ, అంగన్వాడి టీచర్ లు,పంచాయతీ కార్యదర్శి,సిబ్బంది,   వీఆర్ఏలు తో కూడిన గ్రామ స్థాయి మల్టీ డిసిప్లినరీ టీమ్ ఏర్పాటు చేసి, టీమ్ సభ్యులు గ్రామ,హ్యాబిటేషన్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం అందరూ పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరి కి ఇంటింటి సర్వే చేసి వ్యాక్సినేషన్ వేయించాలని అన్నారు. ఎం.పి. డి.ఓ.లు ఎం.పి. ఓ.,సి.డి.పి.ఓ.లు,పంచాయతీ రాజ్,రెవెన్యూ,వైద్య ఆరోగ్య శాఖ, ఇతర శాఖల అధికారులతో మండల స్థాయిలో బుధవారం సమావేశం నిర్వహించి వ్యాక్సినేషన్ డ్రైవ్ సమీక్షించాలని అన్నారు. అంగన్ వాడి సూపర్వైజర్  లు ,పంచాయతీ కార్యదర్శులు వ్యాక్సినేషన్ డ్రైవ్ లో చురుగ్గా పాల్గొని వైద్య, ఆరోగ్య శాఖ డాక్టర్లు సిబ్బందికి సహకరించాలని అన్నారు.  బృందాలు ఇంటింటా సర్వే చేపట్టి మొదటి డోస్, రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎంతమంది, తీసుకొని వారు ఎంతమంది వంటి వివరాల జాబితాను రూపొందించి అందరు వ్యాక్సిన్ తీసుకునేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. నవంబర్ 3 లోగా శతశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అపోహలు, భయాందోళనలు తొలగించే విధంగా  అర్థమయ్యే రీతిలో అవగాహన కలిగించాలని, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని పేర్కొన్నారు.
అన్ని గ్రామపంచాయితీ నర్సరీలలో మట్టి సేకరణ, పాలీథీన్ సంచుల కొనుగోలు,ప్రైమరీ బెడ్లు చేయుట, సీడ్ కొనుగోలు నవంబర్ 3 వ తేదీ లోగా పూర్తిచేయాలని  జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. పురోగతిలో మిగిలి ఉన్న అన్ని వైకుంఠదామాలను నవంబర్ 4 లోగా పూర్తిచేయాలని  అన్నారు.అన్ని గ్రామపంచాయితీ నర్సరీలకు గేటు,ఫెన్సింగ్ మరియు ఇతరత్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు నవంబర్ 3 లోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాలు,  పల్లె ప్రకృతి వనాలకు సంబంధించిన మిగిలిన  చెల్లింపులు అన్ని నవంబర్ 3 వ తేది లోపు పూర్తి చేయాలని అన్నారు. గ్రామపంచాయితీలో 30 మందికి తక్కువ కాకుండా కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని కలెక్టర్  ఆదేశించారు.                        ఈ వి.సి.లో డి. ఆర్.డి.ఓ.కాళిందిని, జిల్లా పరిషత్ సి.ఈ. ఓ.వీరబ్రహ్మ చారి, డి.పి.ఓ.విష్ణు వర్ధన్,స్త్రీ,శిశు,సంక్షేమ, వృద్ధుల,దివ్యంగుల శాఖ జిల్లా సంక్షేమ శాఖాధికారిని సుభద్ర,పంచాయతీ రాజ్ ఈ ఈ తిరుపతయ్య పాల్గొన్నారు.

Share This Post