కరోనా వ్యాధిని నివారించేందుకు 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
సోమవారం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో సీనియర్ సిటిజన్ ఫోరం అధ్వర్యంలో కరోన నివారణ వ్యాక్సిన్ అవగాహన ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గార్లు హాజరై వారి చేతుల మీదుగా ఆడియో విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కరోన టీకా వేసుకోవాలని, మాస్క్ తప్పనిసరిగా వాడాలని ప్రజలకు సూచించారు. కరోన పట్ల అజాగ్రత్తగా ఉండకుండా ఆడియో ఆటో ప్రచారం ద్వారా పట్టణ,గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. జడ్పీ చైర్మన్ సరిత మాట్లాడుతూ కరోనా ప్రారంభ సమయంలో ఆటోల ద్వారా ఆడియో ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, ఈసారి కూడా ప్రతి గ్రామానికి ఆటోలో కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రచారం నిర్వహించడం పట్ల ఆడియో తయారు చేయించిన సీనియర్ సిటిజెన్ ఫోరమ్ సభ్యులను అభినందించారు. అనంతరం కరోన నివారణ అవగాహన ప్రచారం ఆటోను జెడ్పి చైర్మన్, జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు మోహన్ రావు,సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్, సిటిజన్ ఫోరం సభ్యులు బాల కిషన్ రావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాలగారి చే జారీ చేయడమైనది.