కరోనా వ్యాధి నియంత్రణకు 15-18 సంవత్సరాల వయస్సులోపున్న బాలలు వ్యాక్సిన్ తీసుకునే విధంగా తల్లిదండ్రులు చిన్నారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. సోమవారం రామవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 15-18 సంవత్సరాల మధ్య వయస్కులకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ, మున్సిపాల్టీలలో చిన్నారులకు వ్యాక్సిన్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యాక్సిన్ ఎంతో సురక్షితమని వాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్ధులకు వ్యాక్సిన్ తీసుకునే అంశంపై అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యాధి సమూల నిర్మూన కావాలంటే వ్యాక్సిన్ తీసుకోవడమే శ్రీరామరక్ష అని చెప్పారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను నేటి నుండి అందుబాటులోకి రావడం ఎంతో సంతోషమని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో తల్లిదండ్రులు అపోహలు వీడి చిన్నారులకు వ్యాక్సిన్ వేపించాలని చెప్పారు. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేశామని అదే స్ఫూర్తితో 15-18 సంవత్సరాల మధ్యవయసు వారికి కూడా నూరు శాతం పూర్తి చేయుటలో ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు. మన జిల్లాలో 15-18 మధ్య వయస్సున్న చిన్నారులు దాదాపు 60 వేల మంది ఉన్నట్లు ప్రాధమిక అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చే పిల్లలు ఆధార్, ఐడి కార్డులను వెంట తెచ్చుకోవాలని చెప్పారు. ఆన్లైన్లో వ్యత్యాసాలు రాకుండా వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారుల వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నదని, వ్యాక్సినేషన్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వ్యాక్సిన్ కొరత లేదని సమృద్ధిగా ఉందని చెప్పారు. వ్యాక్సినేషన్ తీసుకున్న చిన్నారులు మిత్రులకు, ఇంటి చుట్టు ప్రక్కన వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేంద్రప్రసాద్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ సంజీవరావు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తహసిల్దార్ రామక్రిష్ణ, ఆరోగ్య కేంద్రం మేనేజర్ సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు

Share This Post