కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నెల 20వ తేదీ వరకు ఆంక్షలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో కోవిడ్ ఆంక్షలు కొనసాగింపు, గణతంత్ర దినోత్సవ వేడుకలు, ముక్కోటి మహోత్సవాలు నిర్వహణ, ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటి, ఇసుక రవాణా తదితర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ర్యాలీలు, బహిరంగసభలు, మత, రాజకీయ, సాంస్కృతిక సామూహిక కార్యక్రమాలు నిర్వహణకు అనుమతి లేదని చెప్పారు. వ్యాధి నుండి సురక్షితంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాద్యతగా మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెప్పారు. ఈ నెల 12న భద్రాచలంలో జరుగనున్న స్వామివారి తెప్పోత్సవం, 13న జరుగనున్న ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలను వేదపండితులు, దేవస్థానం అధికారులతో సాంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. కరోనా వ్యాధి వ్యాప్తి దృష్ట్యా భక్తులకు అనుమతి లేదని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మహోత్సవాలను నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం దేవాలయంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. మహెూత్సవాలకు టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు తిరిగి నగదు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యక్ష ప్రసారాలు ద్వారా మహోత్సవాలను భక్తులు వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నందున ఇతర ప్రాంతాల నుండి భక్తులు భద్రాచలం రావొద్దని ఆయన స్పష్టం చేశారు. ఇసుక తీయడానికి అనుమతిచ్చిన ప్రాంతంలోనే ఇసుక తీయాలని, నింగ్, ఎండిసి, భూ గర్భ జల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని, అనుమతిచ్చిన ప్రాంతాల హద్దులు దాటి ఇసుక తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పరిశమ్రలు ఏర్పాటుకు 19 దరఖాస్తులు రాగా 11 యూనిట్లుకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. రెండు దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందని, ఒక దరఖాస్తు ప్రగతిలో ఉన్నట్లు చెప్పారు. యూనిట్లు ఏర్పాటు యొక్క విలువ 23.34 కోట్లు కాగా 163 మందికి ఉపాధి లభించనున్నదని చెప్పారు. జిల్లాలో పరిశమ్రలు ఏర్పాటు ఆవశ్యత ఎంతో ఉన్నదని, తిరస్కరణకు గురైన ఔత్సాహికులకు అవగాహన కల్పించి తిరిగి దరఖాస్తులు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని పరిశ్రమలశాఖ అధికారులకు సూచించారు. తదుపరి నిర్వహించు సమావేశంలో యూనిట్లు వారిగా ఉపాధి లభించు వివరాలు అందచేయాలని చెప్పారు. టి ఫ్రైడ్ పథకం క్రింద మంజూరు చేసిన 44 గిరిజన, 7 ఎస్సీ కులాలు మొత్తం 51 యూనిట్లుకు 1.59 కోట్లు సబ్సిడి మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల్లో అగ్నిమాపక రక్షణ చర్యలను తనిఖీ చేయాలని అగ్నిమాపక అధికారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహణకు ప్రగతి మైదానంలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ సిబ్బందికి ప్రశంసా పత్రాలు జారీకి జాబితా అందచేయాలని అధికారులకు సూచించారు. దేశభక్తి గీతాలతో విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని డిఈఓకు సూచించారు. సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. వేడుకలు నిర్వహణకు మినిట్ టు మినట్ షెడ్యూలు తయారు చేయాలని డిఆర్డక్కు సూచించారు. అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. శాఖల వారిగా జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రాధాన్యతాంశాల నివేదికలు 11వ తేదీ వరకు డిపిఆర్డు అందచేయాలని చెప్పారు. అసెట్లు పంపిణీకి జాబితాను సిద్ధం చేయాలని డిఆర్డిఓకు సూచించారు. ప్రోటోకాల్ ఏర్పాట్లను పర్యవేక్షణ చేయాలని కొత్తగూడెం ఆర్డీఓకు సూచించారు. వేదికను అందంగా అలంకరించాలని చెప్పారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ శివాజీ, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post