కరోనా వ్యాప్తి నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే ఆయుధమని జిల్లాలో ఇంకనూ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకొని వారు తమంతట తాము ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధి హనుమంతు తెలిపారు.

గురువారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, నగర కమిషనర్ ప్రావీణ్య లతో కలసి మైనార్టీ లతో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ తీసుకోకుండా మిగిలిన వారు గడువు పూర్తయిన ఆధారంగా తమంతట తాము ముందుకు వచ్చి రెండవ డోస్ టీకా తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఇంకనూ ఒక్క డోస్ కూడా తీసుకోని ఉన్నారని, గర్భీణీలు, బాలింతలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ప్రతి ఒక్కరు కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకోవచ్చని ఎలాంటి ఆపోహలకు లోనుకాకుండా వారందరు కూడా స్వయంగా ముందుకు వచ్చి టీకా వేయించుకొని స్వీయ రక్షణ పొందాలన్నారు.
హనుమకొండ, వరంగల్ నగరం లలోని మైనార్టీ కాలనీ లలో ఎక్కువ శాతం కోవిడ్ టీకా మొదటి, సెకండ్ డోసులు తీసుకొని 18 సంవత్సరాలు నిండినవారు ఉన్నారని, ప్రతి ఒక్కరూ తప్పకుండా టీకా తీసుకోవడానికి మసీదులలో విస్తృతంగా ప్రచారం చేయాలని, అదేవిధంగా ఇంటింటికి టీకా వేయడానికి వచ్చే వైద్య సిబ్బందికి సహకరించాలని అన్నారు.

జిల్లాలో వ్యాక్సినేషన్ డోసుల కొరత లేదని కొత్త వేరియేషన్ ను ఆపడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని దీన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగ పర్చుకోవాలని కలెక్టర్ కోరారు.
ప్రస్తుతం ధార్డ్ వేవ్ ప్రమాదం పొంచి యున్నందున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ లను ధరించాలని అన్ని విధాల రక్షణ కల్పిస్తుందని కలెక్టర్ అన్నారు.

ఈ సమావేశంలో డియం అండ్ హెచ్ ఓ లలితాదేవి, డిఎండబ్లుఓ శ్రీను, ఇంచార్జ్ అడిషనల్ కమీషనర్ విజయ లక్ష్మి, , సిఎం హెచ్ ఓ రాజారెడ్డి, మైనార్టీలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post