కలంకారి చేతి చిత్రలేఖనం నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి

మహిళలు కాలంకారి చేతి చిత్రలేఖనం నేర్చుకొని ఉపాధి పొందాలని జిల్లా పరిషత్ చైర్మన్ వనజమ్మ అన్నారు.  మంగళవారం ఉదయం ఘాన్ శ్యామ్ సరోడే గృహంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో  మహిళలకు కలంకారి  చేతి  చిత్రలేఖనం పై  నైపుణ్య శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ హరిచందన దాసరితో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్బంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ మహిళలు ఈ చిత్రలేఖనమ్ కళను కష్టపడి నేర్చుకొని ఇక్కడే ఉపాధిని పొందాలని మహిళలకు సూచించారు. ఘాన్ శ్యామ్ సరోడే ఆధ్వర్యంలో ఇద్దరు శిక్షకులను పెట్టి  40 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.  దీనిని మహిళలు సద్వినియోగం చేసుకుంటే మరిన్ని నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి జిల్లాలోని  గృహిణులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని తెలియజేసారు.

జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ నారాయణపేట జిల్లా చేనేత చీరలకు ప్రసిద్ధిగాంచిందని అయితే ఇప్పుడు ఒకే పద్దతిలో కాకుండా కొంగొత్త పద్ధతుల్లో చీరలు తయారు చేయడం వల్ల మంచి పేరుతో పాటు డిమాండ్ ఉంటుందన్నారు.  కాటన్, సిల్క్ బట్టలపై చేతి ద్వారా చిత్ర లేఖనం చేసే పద్ధతిని కలంకారి పెయింటింగ్ అంటారని ఇది కాళహస్తి లో మాత్రం వేయడం జరుగుతుందన్నారు.  ఆధునిక ఒరవడి వల్ల ఎంతో పేరు గాంచిన కలంకారి పెయింటింగ్ అంతరించిపోతుందని, దీనిని నారాయణపేట జిల్లాలో  ఘాన్ శ్యామ్ సరోడే   నైపుణ్య శిక్షణ ఇప్పించడమే కాకుండా శిక్షణ అనంతరం ఇక్కడే ఉపాధి కల్పించడం జరుగుతుందని ముందుకు రావడంతో  డి.ఆర్.డీఏ ఆధ్వర్యంలో నాబార్డ్ సంస్థ సహకారంతో ప్రస్తుతం మొదటి బ్యాచ్ కు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.  మొత్తం 60 మంది మహిళలకు 40 రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మహిళలు ఓపికతో కష్టపడి నేర్చుకొని అంతరించిపోతున్న కళను బతికించడమే కాకుండా ఉపాధిని పొందవచ్చని తెలియజేసారు.   మహిళలకు రానున్న రోజుల్లో ఎంబ్రాయిడరీ ఇతర రంగాల్లో సైతం   శిక్షణ తరగతులు నిర్వహించి ఉపాధి పొందేందుకు కృషి చేయడం జరుగుతుందని  తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గందే అనుసుయా, స్థానిక శాసన సభ్యుల సతిమణి స్వాతి రెడ్డి , పి.డి. డి.ఆర్.డి.ఏ గోపాల్ నాయక్, నాబార్డ్ డి.డి.యం. నాగార్జున, ఘాన్ శ్యామ్ సరోడే, ఆత్మారామ్ ఎడకే శిక్షణ తరగతులు హాజరైన మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post