కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం తపించాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం తపించాలి…

మహబూబాబాద్ జూలై 22:

విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని అది సాధించేందుకు నిరంతరం తపించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఉద్భోధన చేశారు.

గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి వివిధ కళాశాలలో సీట్లు పొందిన 24 మంది విద్యార్థిని విద్యార్థులకు అడ్మిషన్ పత్రాలను కలెక్టర్ అందించి అభినందించారు.

సాంఘిక సంక్షేమ స్కూల్స్ లో విద్యనభ్యసించి కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియేట్ కొరకు 62 మంది ఎంపిక కాగా అందులో 24 మంది ఉచిత విద్య కు ఎంపిక కావడం ఎంతో అదృష్టం అన్నారు.

నిరుపేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వం తప్పనిసరిగా చేయూతని అందిస్తుందని అన్నారు.
ఇదే స్ఫూర్తి ఇకముందు కూడా మరింతగా కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారి రావూరి రాజు తదితరులు పాల్గొన్నారు
——————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post