కలిసికట్టుగా అవినీతిని నిర్మూలిద్దాం అవినీతి రహిత దేశంగా మారుద్దాం అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అవినీతి నిర్మూలన వారోత్సవం లో భాగంగా ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించిన అదనపు కలెక్టర్

కలసికట్టుగా అవినీతిని నిర్మూలిద్దాం అని, దేశాన్ని అవినీతి రహిత దేశంగా  మార్చుకుందామని  అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.
అవినీతి నిర్మూలన వారోత్సవం లో  భాగంగా ( ఈనెల 3 వ తేదీ నుంచి  9వ తేదీ వరకు)  శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ముందుగా వివిధ ప్రభుత్వ  శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది చేత అవినీతిని  నిర్మూలిద్దాం అని  ప్రతిజ్ఞ చేయించారు.
‘భారత దేశ పౌరునిగా అవినీతిని ప్రోత్సహించినని, అవినీతికి పాల్పడనని,  అవినీతిని నిర్మూలించడంలో,  భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా రూపు దిద్దడంలో నా వంతు కృషి చేస్తానని నా మాతృభూమి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులందరూ చక్కగా తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.  ఎవరు కూడా అవినీతికి పాల్పడ వద్దని  కోరారు. సుపరిపాలనతో, అవినీతి లేని దేశంగా  తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం పోస్టర్ ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో  ఏ.సి.బి.డి.ఎస్.పి.కృష్ణ గౌడ్,ఇన్స్పెక్టర్ వెంకట్ రావు, కలెక్టరేట్ ఏవో మోతీ లాల్,,డి.టి
విజయ్,  వివిధ శాఖల అధికారులు,  కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post