కలెక్టరేటు ఆడిటోరియం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా పిర్యాదులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్, శ్యామ్ ప్రసాద్ లాల్.

ప్రజావాణిలో వచ్చే సమస్యలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలి

ప్రజావాణికి 358 ధరఖాస్తులు

అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్,  జి.వి శ్యామ్ ప్రసాద్ లాల్

0000

ప్రజావాణిలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ (లోకల్ బాడీల్), శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్  ఆడిటోరియంలో  నిర్వహించిన ప్రజావాణి  కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 358 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను  అదనపు కలెక్టర్లు స్వీకరించారు.  ప్రజల నుండి  అందిన  దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు పంపినట్లు వారు తెలిపారు. ఇందులో అత్యధికంగా ఎస్సీ కార్పోరేషన్ కు చెందినవి 224,  రెవెన్యూకు సంబంధించినవి 78, పంచాయతి శాఖకు చెందినవి 20,   కాగా ఇతర శాఖలకు  సంబంధించినవి 36 ఉన్నాయని   అదనపు కలెక్టర్లు తెలిపారు.  ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను  ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను  ఆదేశించారు. పెండింగ్ లో  ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి  పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి సి.ఈ.ఓ ప్రియాంక, కలెక్టరేట్ ఏ.ఓ లక్ష్మారెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస రావు, అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న, పశుసంవర్ధక శాఖ అధికారి నరేందర్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీలత, రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, ఏ.డి, ల్యాండ్ అశోక్, వయోజన విద్యా శాఖ అధికారి, జయశంకర్, మెప్మా పీ.డి రవిందర్, ఎల్.డి.యం ఆంజనేయులు, సిపిఓ కొమురయ్య, వెనుకబడిన తరగతుల అధికారి రాజమనోహర్ రావు, షెడ్యుల్డ్ కులాల అభివృద్ది అధికారి నతానియేలు, జిల్లా పంచాయతి అధికారి వీరబుచ్చయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, హార్టికల్చర్ డిడి శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్, డిప్యూటీ తహశిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post