కలెక్టరేటు ఆడిటోరియం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా పిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి

ప్రజావాణికి 100 దరఖాస్తులు

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

00000

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహి

స్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మంది ప్రజల సమస్యలకు సంబంధించి దరఖాస్తులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అందిన దరఖాస్తులను పరిష్కరించుట కు వెంటనే సంబంధిత శాఖలకు పంపినట్లు ఆయన తెలిపారు. ఇందులో 50 రెవెన్యూకు సంబంధించినవి, 04 మున్సిపల్ కార్పోరేషన్ కు చెందినవి, 03 జిల్లా మెడికల్ మరియు హెల్త్ కు చెందినవి మిగితా 43 ఇతర శాఖలకు సంబంధించినవని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, మున్సిపల్ కమీషనర్ యాదగిరి రావు, ట్
అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, ఆర్డీవో ఆనంద్ కుమార్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, ఎక్సైజ్ సూపరిండెంట్ చంద్రశేఖర్, డీఎంహెచ్వో జువేరియా, డిఆర్ డి ఓ శ్రీలత, డి పి ఓ వీర బుచ్చయ్య, డి సి ఓ శ్రీ మాల, మార్కెటింగ్ శాఖ డిడి పద్మావతి, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి, ఎల్ డి ఎం లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post