కలెక్టరేటు లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా పిర్యాదులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి

ప్రజావాణికి 105 దరఖాస్తులు

జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

00000

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు.

సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 105 మంది ప్రజల సమస్యలకు సంబంధించి దరఖాస్తులను ఆయన స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు పంపినట్లు ఆయన తెలిపారు. ఇందులో 58 రెవెన్యూకు సంబంధించినవి, 07 మున్సిపల్ కార్పోరేషన్ కు చెందినవి, 04 పోలిస్ కమిషనర్ కు చెందినవి,07 జిల్లా పంచాయతీ శాఖాకు చెందినవి, కాగా మిగితా 29 ఇతర శాఖలకు సంబంధించినవని ఆయన తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమీషనర్ యాదగిరి రావు, డీఎంహెచ్ ఓ జువేరియా, డి పి ఓ వీర బుచ్చయ్య, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post