కలెక్టరేట్లోని పిడి కార్యాలయ మీటింగ్ హాల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తున్న సీనియర్ సివిల్ జడ్జి మరియు కార్యదర్శి జిల్లా న్యాయసేవాధికార సంస్థ బి. సుజయ్

 

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

సీనియర్ సివిల్ జడ్జి మరియు కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ : బి. సుజయ్

0000

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి మరియు కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కరీంనగర్ బి. సుజయ్ అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ లో గల పిడి డ్వామా కార్యాలయం మీటింగ్ హాల్ లో జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలను అనుసరించి *ఆజాది క అమృత్ మహోత్సవ్* లో భాగంగా సీనియర్ సివిల్ జడ్జి మరియు కార్యదర్శి జిల్లా న్యాయసేవాధికార సంస్థ బి. సుజయ్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి జిల్లా న్యాయసేవాధికార సంస్థ మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన చట్టాలు, మరియు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు, సమయం వృధా కాకుండా సమస్య పరిష్కారానికై జిల్లా న్యాయసేవాధికార సంస్థ ను సంప్రదించాలని మరియు లోక్ అదాలత్ లను వినియోగించుకోవాలని కోరారు, న్యాయసేవాధికార సంస్థ మరియు దాని యొక్క విధులు, విధానాలు మహిళలకు తెలియజేశారు న్యాయసేవాధికార సంస్థ ఉచితంగా న్యాయవాది ని నియమించి న్యాయ సహాయము అందించగలదని ప్రజలు న్యాయసేవాధికార సంస్థ గురించి అవగాహన పెంపొందించుకోవాలని, ప్రజలు ఎల్లప్పుడూ చట్టాలను అనుసరించాలని అప్పుడు మాత్రమే సమస్యలకు గురికాకుండా వీలవుతుందని, మహిళలు వారికి ఏర్పరచిన చట్టాల గురించి మరియు బాధ్యత గురించి అవగాహన ఏర్పరుచుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాది తిరుమలాదేవి న్యాయ సేవా అధికార సంస్థ మండలి సభ్యులు తణుకు మహేష్ వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ వెంకటేశ్వర్లు, ఏపియం రాజేందర్, కరీంనగర్ జిల్లాలోని స్వయం ఉపాధి సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Share This Post