కలెక్టరేట్లో అందుబాటులోకి మీ సేవ కేంద్రం…… జిల్లా కలెక్టర్ హనుమంతరావు
భూ సమస్యలపై కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన ధరణి హెల్ప్ డెస్క్ లో మీసేవ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.
బుధవారం ఆయన కలెక్టరేట్లోని మీసేవ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు.
ధరణి కి సంబంధించి మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలు ఎక్కడెక్కడో మీ సేవా కేంద్రాల కోసం తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా కలెక్టరేట్లోనే మీసేవ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కేంద్రాన్ని బుధవారం నుండి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
మీ సేవా కేంద్ర నిర్వహణ సజావుగా జరిగేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు.
కలెక్టర్ వెంట అదనపుకలెక్టర్ వీరారెడ్డి, తదితరులు ఉన్నారు.