కలెక్టరేట్లో జాతీయ‌ జెండా ఆవిష్క‌రించిన అదనపు కలెక్టర్- యస్. మోతిలాల్

స్వతంత్ర భారత ప్రజోత్సవ వేడుకల్లో 76వ భాగంగా ఇవ్వాల (సోమవారం) స్వాతంత్య్ర దినోత్సవాన నాగర్ కర్నూలు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్, కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ పాత్రికేయులు, విద్యార్థులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్వతంత్ర భారత స్వర్ణోత్సవ వేళ భారత స్వాతంత్య్రోద్యమ అమర వీరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.
జాతీయ గీతాన్ని ఆలపించిన విద్యార్థులకు పెన్నులు, నోటుబుక్కులను పంపిణీ ఆయన చేశారు.
అనంతరం పాత్రికేయులు, అధికారులతో కలిసి తేనీటివిందును స్వీకరించారు.

Share This Post