కలెక్టరేట్లో టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

పత్రికా ప్రకటన తేదీ: 8-10-2021
కరీంనగర్

తెలంగాణ లో అతి పెద్ద పండుగ బతుకమ్మ

ఆడపడుచులు సంబరంగా జరుపుకునే వేడుక ఇది

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
000000

తెలంగాణలో మహిళలకు అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని, ఆడపడుచులు జరుపుకునే వేడుక బతుకమ్మ అని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి కాలుష్యం లేని పూల పండుగ బతుకమ్మ అని అన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ప్రకృతి దేవతను పూజించే పండగ బతుకమ్మ అని కలెక్టర్ కొనియాడారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి ఆడపడుచు దుర్గామాత అని అన్నారు. తెలంగాణలో పూలను పూజించే సంస్కృతి గొప్పదని అన్నారు అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ ప్రకృతి, పువ్వులు, మహిళలు కలిస్తేనే బతుకమ్మ అని అన్నారు. బతుకమ్మ ను కొలవడం గొప్ప సాంప్రదాయమని తెలిపారు. అనంతరము జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, టీఎన్జీవోస్ యూనియన్ నాయకులు, మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు.
ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో తీరొక్క రంగు పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర సంఘం కార్యదర్శి నాగుల నరసింహ స్వామి, అర్బన్ అధ్యక్షుడు హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షుడురాజేష్ భరద్వాజ్ మహిళా విభాగం అధ్యక్షురాలు శారద, మహిళా ప్రతినిధులు సబితా, దుర్గా, శైలజ, సునీత, పద్మా రెడ్డి, శివాని, కవిత తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారి జారీ చేయడమైనది.

Share This Post