కలెక్టరేట్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

ప్రజలందరికీ ఒకే చోట ప్రభుత్వ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన కలెక్టరేట్‌ సముదాయాల నిర్మాణంలో భాగంగా జిల్లాలోని నన్చూర్‌లో చేపట్టిన కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి భవనాన్ని వినియోగంలోకి తీనుకురావాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను ఆకన్మికంగా తనిఖీ చేశారు. ఈ సoదర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సoబంధిత అధికారులకు నూచించారు. జిల్లా కలెక్టర్‌ నివానం కొరకు కేటాయించిన భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి అక్టోబర్‌ మాసాంతం లోగా అందజేయాలని తెలిపారు. అనంతరం నస్పూర్ లో  దాదాపు నిర్మాణం పూర్తి అయి ప్రారంభానికి సిద్దంగా ఉన్న ఈ.వి.ఎం. గోదాములను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో రోడ్డు, భవనాల శాఖ ఈ.ఈ. రాము, హౌనింగ్‌ డి.ఈ. బావుసింగ్, గుత్తేదారులు, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

మంచిర్యాల జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post