కలెక్టరేట్ ఆడిటోరియంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్ [కరీంనగర్ జిల్లా]

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

కోవిడ్ వ్యాక్సినేషన్ సమయంలో స్వయం సహాయక బృందాల సేవలు అభినందనీయం

గర్భిణీలు సాధారణ ప్రసవాల చేసుకునేలా మహిళా సంఘాలు చైతన్యం తేవాలి

మెప్మా మహిళా సంఘాలు ప్రతి నెల విధిగా సమావేశాలు నిర్వహించుకోవాలి

అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

0000000

బ్యాంకులు, ఇతర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని యూనిట్లను స్థాపించి మహిళ సంఘాల్లోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు.

గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ( మెప్మా) కార్యక్రమాలపై మహిళా స్వయం సహాయక సంఘాలకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ సమయంలో స్వయం సహాయక బృందాల సేవలు అభినందనీయమన్నారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు మహిళా సంఘాలు తమ వంతు బాధ్యత తీసుకోవాలన్నారు. భారతదేశంలోనే కరీంనగర్ జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్ లు అధికంగా జరుగుతున్నాయని, వాటిని తగ్గించేందుకు గర్భిణీలు సాధారణ ప్రసవాలు చేసుకునేలా మహిళల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. కరీంనగర్ జిల్లాను అనేమియా ముక్త్ జిల్లాగా చేసేందుకు బరువు ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలు, మహిళలు పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంఘాల్లోని పేద మహిళలు బ్యాంకులు ఇతర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని చిన్న యూనిట్ల నుండి పెద్ద యూనిట్ల వరకు స్థాపించి పారిశ్రామికవేత్తల ఎదగాలన్నారు. జిల్లాలో మెప్మా మహిళా సంఘాలు ఇప్పటికే క్యాటరింగ్ సిల్వర్ ఫిలిగ్రీ, గార్మెంట్స్, జ్యూట్ బ్యాగ్స్, హోమ్ ఫుడ్స్ వంటి యూనిట్లను స్థాపించి ఆర్థికంగా లాభ పడుతున్నారన్నారు. ఉత్పత్తులకు మంచి ప్యాకింగ్ బ్రాండింగ్ తో ఇంకా వ్యాపారం విస్తరించుకున్నారు. ధర్మా మహిళా సంఘాలు ప్రతి నెల విధిగా సమావేశాలు నిర్వహించుకోవాలని వాటిలో అర్థవంతమైన చర్చలు జరగాలని, రిజిస్టర్లు సరిగా నిర్వహించాలని అన్నారు. పోషణ అభియాన్ స్వచ్ఛత వంటి కార్యక్రమాల్లో మహిళా సంఘాలు చురుగ్గా పాల్గొనాలని అన్నారు. వీధి వ్యాపారులకు పి యం స్వానిధి కింద రుణాలు వచ్చినందున కర్మన్ నగరపాలక సంస్థ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు.

మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీందర్ మాట్లాడుతూ మహిళా సంఘాలు అరె కవ్వాలి ల పైన దృష్టి సారించాలని తీసుకున్న రుణాలు సరిగా చెల్లించే టట్లు ఆర్ పి లు మహిళా సంఘాల ఆఫీస్ బేరర్ చొరవ తీసుకోవాలని అన్నారు ఫ్లిప్కార్ట్ ద్వారా కరీంనగర్ ఫిలిగ్రీ, హ్యాండ్లూమ్, కాటన్ దుస్తుల యూనిట్ కి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు.

ఈ సమావేశం లో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీందర్, లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆంజనేయులు, మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్, మెప్మా డియంసి శ్రీ వాణి,అడఎంసీ మల్లీశ్వరి, సి ఓ పద్మ,సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post