కలెక్టరేట్ ఆడిటోరియం లో మద్యం షాపులకు డ్రా ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇస్తున్న జిల్లా మద్య నిషేధ మరియు ఆబ్కారి అధికారి చంద్రశేఖర్.

 

నేడు కలెక్టరేట్ ఆడిటోరియంలో 94 మద్యం షాపులకు డ్రా

జిల్లా మద్య నిషేధ మరియు ఆబ్కారి అధికారి కె. చంద్రశేఖర్

000000

జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 94 మద్యం షాపులకు 20 నవంబర్ శనివారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రా తీయటం జరుగుతుందని జిల్లా మద్య నిషేధ మరియు అబ్కారి అధికారి కె. చంద్రశేఖర్ అన్నారు.

శనివారం ఉదయం 10.00 గంటల నుండి నిర్వహించే ఇట్టి డ్రా కి వచ్చే దరఖాస్తుదారులు ఖచ్చితంగా ఎంట్రీ పాస్ తమ వెంట తెచ్చూకోవాలని అయన తెలిపారు.

శనివారం రోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్న డ్రా కి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించి అబ్కారి సిబ్బందికి తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిఐ వి చంద్రమోహన్, ఎస్సై చిరంజీవి, హెడ్ కానిస్టేబుల్ మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post