కలెక్టరేట్ ఆడిటోరియం లో జరిగిన అంతర్జాతీయ వాయోధికుల దినోత్సవం సందర్బంగా మాట్లాడుతున్న ACP మదన్ లాల్, RDO ఆనంద్ కుమార్.

వృద్ధాప్యం శాపం కాదు:

ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకోవాలి:

రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్

ఘనంగా అంతర్జాతీయ వయోధికుల దినోత్సవ వేడుకలు:
-000-
వృద్ధాప్యం ఎంత మాత్రం శాపం కాదని, ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకుంటే జీవన ప్రమాణాలు పెంచుకోవచ్చునని కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ వయోధికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.డి.వో. మాట్లాడుతూ వృద్ధులు ఎంతో అనుభవజ్ఞులని, వారి సలహాలు, సూచనలు నేటి తరానికి ఆదర్శనీయం అని అన్నారు. డిజిటల్ ప్రపంచంలో వయోధికుల భాగస్వామ్యం పెంచటానికి ఈ ఏడాది అన్ని వయస్సుల వారికి డిజిటల్ సమానత్వం అనే అంశాన్ని ఎంచుకోవడం అభినందనీయం అని అన్నారు.

ఏ.సి.పి. మదన్ లాల్ మాట్లాడుతూ వృద్దాప్యాన్ని అధిగమించేందుకు ప్రతి రోజు ఉదయం నడక అలవాటు చేసుకోవాలని తెలిపారు. యోగా, ధ్యానం చేయాలని సూచించారు. వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సురక్ష యోజన ప్రభుత్వం ఏర్పాటు చేసిందని 9440900971 సెల్ నెంబర్ కు ఫోన్ చేస్తే పోలీస్ శాఖ పక్షాన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. వృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి బి.రవీందర్, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మోసం అంజయ్య, డాక్టర్. నాగశేఖర్, వివిధ వయోధికుల సంఘాల ప్రతినిధులు సముద్రాల జనార్ధన్ రావు, బండ సత్తయ్య, ఉప్పుల రామేశం, న్యాలకొండ శంకరయ్య, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.

Share This Post