కలెక్టరేట్ కార్యాలయం లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భముగా పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా).

పత్రికాప్రకటన
తేదిః 26-01-2022
కరీంనగర్

కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

0 0 0 0

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కలెక్టరేట్ లో నిరాడంబరంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ముందుగా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, సమాచార పౌరసంబంధాల శాఖ, కరీంనగర్ గారిచే జారిచేయనైనది.

 

కలెక్టరేట్ కార్యాలయం లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భముగా పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా).

Share This Post