కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో శుక్రవారం లే అవుట్స్ అప్రూవల్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ నిర్వహించారు.

ప్రచురణార్థం

ఖమ్మం, జూలై 29:

కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో శుక్రవారం లే అవుట్స్ అప్రూవల్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుడా పరిధిలోని 10, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4 లే అవుట్లకు అనుమతుల విషయమై కమిటీ పరిశీలన చేసింది. రెవిన్యూ, ఇర్రిగేషన్, విద్యుత్ సమస్యలు లేకుండా, నిబంధనలకు లోబడి ఉన్న లే అవుట్స్ లకు సమావేశంలో అనుమతులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమస్యలు ఉన్న లే అవుట్స్ లలో సంబంధిత శాఖల అధికారులు సంయుక్త సర్వే చేపట్టి తదుపరి చర్యలకై పది రోజుల్లో నివేదిక సమర్పించాలని అన్నారు. కార్పొరేషన్ పరిధిలోనే కాకుండా, సుడా పరిధిలోని అన్ని లే అవుట్లకు ఇట్టి కమిటీ అనుమతులు ఇస్తుందని ఆయన తెలిపారు. గ్రీన్ స్పెస్ లో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలన్నారు. అనుమతితో పేర్కొన్న నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టాలని ఆయన అన్నారు. కమిటీ నుండి దరఖాస్తు అందగానే సంబంధిత విభాగ అధికారులు అనుమతి విషయమై చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహాలత, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఎడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ రాము, ఇంజనీరింగ్ అధికారులు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post