కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సంస్కృతికి సంప్రదాయాలకు నిలయమైన తెలంగాణాలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ లో వివిధ శాఖల ఉద్యోగినులు బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బతుకమ్మకు పూజ కార్యక్రమాలు నిర్వహించి, బతుకమ్మను తలపై పెట్టుకొని బతుకమ్మ ఆడే ప్రాంగణానికి చేరుకొని ఆట పాట ఆడారు. ఈ సందర్బంగా కలెక్టర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, దసరా, దీపావళి పండగలను ప్రజలు ఘనంగా సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకోవాలని అన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని, మొదటి డోస్ తీసుకున్న వారు రెండవ డోస్ తీసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వలన పండుగలను కోవిడ్ ఫ్రీ గా నిర్వహించుకోవచ్చని అన్నారు. ఉద్యోగినులు బతుకమ్మలను ఆడుకోవడం సంప్రదాయం లో భాగం అని అన్నారు. అంతర్జాతియ బాలికల దినోత్సవం సందర్బంగా కలెక్టర్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో DLSA కార్యదర్శి క్షమా దేశ్ పాండే, అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా విద్య శాఖ అధికారి ప్రణీత, సహాయ కోశాధికారి హారిక, కలెక్టరేట్ పరిపాలన అధికారి అరవింద్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు వర్ణ, రాజేశ్వర్, స్వాతి, మెప్మా, ICDS, విద్యాశాఖ, రెవెన్యూ, తదితర శాఖల ఉద్యోగినిలు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post