కలెక్టరేట్ లో జాతీయ పథకాన్ని ఎగురవేసిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 15, 2021ఆదిలాబాదు:-

75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఆదివారం రోజున కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో, కలెక్టరేట్ లో కలెక్టర్ జాతీయ పథకాన్ని ఎగురవేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్యార్థినిలకు నోటు పుస్తకాలు, పెన్సిల్ లను కలెక్టర్ అందజేసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ లో పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పథకాన్ని ఎగురవేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలు అనుసరించి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణ పాటించాలని, మాస్క్ లు ధరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. ఉద్యోగులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, ఎం.డేవిడ్, ఆర్డీఓ జాడి రాజేశ్వర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి అరవింద్ కుమార్,ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post