కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లు కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. డి.యెస్.ఓ

కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లు కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. డి.యెస్.ఓ

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూంతో పాటు టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశామని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం కంట్రోల్ రూమ్ ను కలెక్టరేట్ పాలనాధికారి మన్నన్ తో కలిసి ప్రాంరంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ రమేష్ ల ఆదేశాల మేరకు 24×7 గంటలు అందుబాటులో ఉండే విధంగా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు,కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా, కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 98666 85527 కు సమాచారం అందిస్తే సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్, పుర సరఫరాల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post