కలెక్టరేట్ ( IDOC) లో మహర్షి భగీరథ జయంతి వేడుకలు
– మహర్షి భగీరథ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్
– మహర్షి భగీరథ స్ఫూర్తితో యువత లక్ష్య సాధనకు కంకణబద్దులు కావాలి
– జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి
——————————
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం మహర్షి భగీరథ జయంతి వేడుకలు నిర్వహించారు.
IDOC లోని తన ఛాంబర్ లో మహర్షి భగీరథ
చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మహర్షి భగీరథ ఋషి జీవిత చరిత్రను స్మరించుకున్నారు.
బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి, దివి నుండి భువికి గంగ ను తెచ్చాడని చెప్పారు. మానవాళికి మహోపకారం చేసిన భగీరధుడు అందరికి ఆదర్శ ప్రాయుడని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి చెప్పారు.
సంకల్పం ,తపన ఉంటే అసాధ్యం ను సుసాధ్యం చేయవచ్చునని భగీరథ మహర్షి నిరూపించి చూపాడని … యువత మహర్షి భగీరథుడిని స్ఫూర్తిగా తీసుకుని తాము ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలు అధిోహించాలని అన్నారు.
——————————
డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.