జిల్లా అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులద్దేశించి మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అలాగే గ్రామీణ, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలలో దేశ స్థాయిలో ఏ అవార్డు ప్రకటించిన సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలుస్తుందని మును ముందు కూడా జిల్లా అభివృద్ధికి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గరిష్ట స్థాయిలో విజయవంతం అయ్యేలా అధికారులు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ఓ చెన్నయ్య, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్, కలెక్టరేట్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారిచేయనైనది.
