కలెక్టరేట్ సమావేశ మందిరం లో క్లస్టర్, స్పెషల్ ఆఫీసర్స్, బ్యాంకర్ల లతో జరిగిన దళిత బందు సమీక్ష సమావేశం లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, శ్యాం ప్రసాద్ లాల్, ట్రేయిని కలెక్టర్,zp ceo ప్రియాంక తదితరులు.(కరీంనగర్ జిల్లా )

రీ సర్వే లో కొత్తగా గుర్తించిన దళిత బంధు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో వెంటనే అప్లోడ్ చేయండి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

0000000

హుజరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు రీ సర్వే లో కొత్తగా గుర్తించిన లబ్ధిదారుల వివరాలను వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు పథకం పై అదనపు కలెక్టర్లు, హుజూరాబాద్ నియోజకవర్గం లోని ఏడు మండలాల క్లస్టర్ అధికారులు, ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే లో కొత్తగా గుర్తించిన అర్హులకు దళిత బంధు ఖాతాలు వెంటనే తెరవాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. డోర్ లాక్, మై గ్రేటెడ్, షిఫ్ట్, డబుల్ దరఖాస్తు, మరణించిన వారి వివరాలను మరొక్కసారి ధృవీకరించుకొని వంద శాతం అప్లోడ్ చేయాలని కలెక్టర్ తెలిపారు.

జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల రవీందర్ ఆర్థికంగా ఉన్నందున తన బ్యాంకు ఖాతాలో జమ అయిన దళిత బంధు 10 లక్షల రూపాయలను వద్దని స్వచ్ఛందంగా లిఖితపూర్వకంగా తెలిపినందుకు కలెక్టర్ అతడిని అభినందించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, క్లస్టర్ అధికారులు, ప్రత్యేక అధికారులు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు

Share This Post