కలెక్టరేట్ సమావేశ మందిరం లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు వేసి మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాట స్ఫూర్తి యువతరానికి స్ఫూర్తిదాయకం

హక్కుల కోసం పోరాడిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్
00000

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాట పటిమ యువతరానికి స్పూర్తి దాయకమని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ 106 వ జయంతిని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ సకల జనుల సబ్బండ వర్గాల ప్రజల కోసం జీవితాంతం పోరాడడనీ గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పోరాటయోధుడు కొమరం భీమ్ తో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా పోరాట యోధుడిగా కీర్తి గడించారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి వి శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా అధికారులు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Share This Post