కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సి పి, ఏ సి, జిల్లా అధికారులు, సిబ్బంది

2022 నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ని పోలీస్ కమిషనర్ కె.ఆర్ నాగరాజ్, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ఇతర అధికారులు, వారి సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

శనివారం నాడు కలెక్టరేట్లో పలువురు అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను కలిశారు. కలెక్టరేట్ ఏవో సుదర్శన్, సిబ్బంది, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి , సంఘ ప్రతినిధులు, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్ ఆయన సిబ్బంది, ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి రమేష్, పశువర్ధక శాఖ జె.డి భరత్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డిడి హార్టికల్చర్ నర్సింగ్ దాస్, డి ఆర్ డి ఓ చందర్, పోలీస్ శాఖ అధికారులు, డి ఎస్ సి డి ఓ శశికళ, స్నేహ సొసైటీ సిద్దయ్య, విద్యార్థులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, ఆయా శాఖలకు సంబంధించిన సిబ్బంది, కలెక్టర్ క్యాంప్ కార్యాలయం సిబ్బంది మహేష్ రాము గంగాధర్ తదితరులు కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య ఆధ్వర్యంలో వేద పండితులు కలెక్టర్కు ఆశీర్వచనం ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చేత కేక్ కట్ చేయించారు. పేద విద్యార్థులకు పంపిణీ చేయడానికి పలువురు బ్లాంకెట్ లు కలెక్టర్కు అందించారు. డిచ్పల్లి లోని మానవతా సదన్ విద్యార్థుల కొరకు రెవెన్యూ సంఘం తరపున 20,000 రూపాయల చెక్కును కలెక్టర్కు అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొత్త సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాలపై మరింత దృష్టి కేంద్రీకరిద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ మన దరిదాపులకు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ వస్తే దానిని ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

అనంతరం కలెక్టర్ డిస్టిక్ అండ్ స్టేషన్స్ జడ్జి సునీత కుంచల ఇంటికి వెళ్లి ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

 

Share This Post