కలెక్టర్ కు శుభాకాంక్షలు

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

శుక్రవారం నాడు కలెక్టర్ చాంబర్లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ రెడ్డి ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు, టీఎన్జీవోస్ అధ్యక్షులు అలుక కిషన్ ఆధ్వర్యంలో, జిల్లా పరిషత్ సీఈవో గోవిందు ఆధ్వర్యంలో జెడ్పీ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ చేత కేక్ కట్ చేయించారు.

Share This Post