కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో బతుకమ్మ వేడుకలు

పత్రికా ప్రకటన తేదీ: 8-10-2021
కరీంనగర్

కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ ఆడిన కలెక్టర్
00000

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ క్యాంప్ ఆఫీస్ లో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ప్రియాంక కర్ణన్ ( కలెక్టర్ సతీమణి), మహిళలు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. పచ్చటి గడ్డితో కూడిన మైదానం లో బతుకమ్మలను పెట్టి కలెక్టర్ దంపతులు కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సతీమణి ప్రియాంక కర్ణన్, మహిళలు, క్యాంప్ ఆఫీస్ సీసీలు, సిబ్బందితో పాటు కలెక్టర్ ఆర్ వి కర్ణన్ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడి పాడారు. ప్రకృతి దేవత అయిన బతుకమ్మను కొలుస్తూ బతుకమ్మ పాటలు పాడారు. ఆటలు ఆడారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post