కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనల్లో గుర్తించిన అంశాలపై సంబంధిత జిల్లా అధికారులు సమగ్ర నివేదికలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

గురువారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ వివిధ మండలాల్లో పర్యటనలు నిర్వహణ సందర్భంలో క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలపై అదనపు కలెక్టర్, జడ్పీ సిఈఓ, డిపిట, డిఆర్డిఓ, వైద్య, మిషన్ బగీరథ, మైనింగ్, సిపిఓ, ఇరిగేషన్, అంగన్వాడీ, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముల్కలపల్లి.. మండల పర్యటనలో వేముకుంట గ్రామంలోని రెండు పడక గదుల ఇండ్లలో నివసిస్తున్న ప్రజలు వేముకుంట గుట్ట నుండి వర్షపు నీరు ఇండ్లలోకి వస్తుందని సమస్యను పరిష్కరించాలని, పిర్యాదు చేయగా ఇదిగేషన్ డిఈ మోతిలాల్ ను ఇండ్లలోకి నీరు రాకుండా చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు అందచేయాలని ఆదేశించినప్పటికీ ఇంతవరకు నివేదికలు అందచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిఈకి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఇరిగేషన్ ఈఈ అర్జున్కు సూచించారు. అలాగే ఈ నెల 5వ తేదీన బూర్గంపాడు మండలంలోని, గౌతంపూర్ కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంలో కేంద్రం ద్వారా పంపిణీ చేస్తున్న కోడిగుడ్లు చిన్నవిగా ఉన్నట్లు గుర్తించానని, | అంగన్వాడీ సూపర్వైజర్ సుశీలకు షోకాజ్ నోటీస్ జారీ చేసి వివరణతో తనకు నివేదికలు అందచయాలని జిల్లా సంక్షేమ అధికారికి సూచించారు. సిడిపిఓలు అంగన్వాడీ కేంద్రాలను నిందతరం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. కలెక్టర్ క్షేత్రస్థాయిలో నిర్వహించు పర్యటనల్లో గుర్తించిన అంశాలపై అధికారులకు నివేదిక పంపుతున్నామని, అట్టి నివేదిక ఆధారంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుని యాక్షన్ టేకెన్ రిపోర్టులు పంపాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో గుర్తించిన అంశాలపై ప్రతి 15 రోజులకు ఒక సారి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మలేరియా, డెంగీ వ్యాధి కేసులు నియంత్రణలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు డ్రై డే నిర్వహించి ప్రతి ఇంటిని తనిఖీ చేయాలని చెప్పారు. బృహత్ పల్లె పకృతి వనాల్లో మొక్కల సంరక్షణకు డ్రిప్ ఏర్పాటు చేయాలని చెప్పారు. బృహాత్ పల్లె పకృతి వనాలను జడ్పీ సిఈఓ, డిఆర్డిఓ, డిపిఓలు తనిఖీ చేయాలని చెప్పారు. యానంబైలు నుండి రాజాపురం వరకు రహదారి నిర్మాణ పనులను చేపట్టాలని ర.భ. ఈ ఈ కి సూచించారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులపై ప్రతి శనివారం వర్కు నివేదికలు అందచేయాలని చెప్పారు. కొత్తగూడెం పట్టణం అంబేద్కర్ కూడలిలో అందమైన మల్టీపర్పస్ పూల మొక్కలు నాటాలని, విద్యుద్దీకరణ చేయాలని చెప్పారు. బస్టాండ్ సెంబర్లో మన కొత్తగూడెం అని ఏర్పాటు చేసిన ప్రాంతంలో విద్యుద్దీకరణ చేయాలని మున్సిపల్ కమిషనరు ఆదేశించారు. కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలోని 20వ వార్డులో నిరుపయోగంగా ఉన్న గోడౌన్ ను వీధి వ్యాపారులకు కేటాయించు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. ప్రధాన రహదారుల్లో ఖాళీ ఉన్న ప్రాంతాలతో పాటు రహదారులకు ఇరువైపులా మల్టీపర్పస్ అందమైన పూల మొక్కలు నాటాలని చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ దీప్, జడ్పీ సిఈఓ విద్యాలత, డిపిఓ, రమాకాంత్, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, వైద్యాధికారులు శిరీష, ముక్కంటేశ్వరావు, సిపిఓ యుఎస్ రావు, ఇరిగేషన్ అధికారి అర్జున్, మిషన్ బగీరథ ఈ ఈ తిరుమలేష్, మైనింగ్ ఏడి జై సింగ్, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్ కమిషనర్లు సంపత్కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Share This Post