టీఎస్ ఐపాస్ క్రింద 21 యూనిట్లకు 11.75 కోట్ల సబ్సిడీ మంజూరు.
జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్
-o0o-
జిల్లాలో టీఎస్ ఐపాస్ క్రింద దరఖాస్తు చేసుకున్న 21 యూనిట్లకు 11.75 కోట్ల సబ్సిడీ మంజూరుకు ఆమోదించ నైనదని జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని వారి చాంబర్లో జిల్లా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు టకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల కు 21 యూనిట్లు మంజూరు చేసి 11.75 కోట్ల రూపాయల సబ్సిడీ మంజూరు కు సమావేశంలో ఆమోదించి, నిధుల విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఇందులో 10 గ్రానైట్ కటింగ్ యూనిట్లు, 2 సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 1 స్టోన్ క్రషర్స్ యూనిట్లు, 4 జనరల్ ఇంజనీరింగ్ యూనిట్లు, 3 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 1 మినరల్ వాటర్ ప్లాంట్ యూనిట్ లు గలవని తెలిపారు . ఈ యూనిట్ల ద్వారా 247 మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు. అలాగే టి. ఫ్రైడ్ పథకం క్రింద 3 ట్రాక్టర్లు కొనుగోలు చేసుకున్నా ముగ్గురు లబ్ధిదారులకు 9.05 లక్షల రూపాయల సబ్సిడీ మంజూరు కు ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అలాగే టిఎస్ ఐ .పాస్ క్రింద, టి. ఫ్రైడ్ క్రింద పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిశీలించి మంజూరుకు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, వెహికిల్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి, ఎన్ పి డి సి ఎల్. డీఈ శ్రీనివాస్ , ఎల్ డి ఎం లక్ష్మణ్ , కాలుష్య నివారణ బోర్డు ఏ. ఈ సుభాష్ , డి టి పి ఓ ఆంజనేయులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ చంద్ర వికాస్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ మధులత తదితరులు పాల్గొన్నారు.