కల్తీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం :జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ డి జోయల్ డేవిస్

కల్తీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

– ఇతర రాష్ట్రాలు,ఇతర ప్రాంతాలనుండి ధాన్యం రాకుండా చర్యలు తీసుకుంటున్నాం
– దళారీలకు తక్కువ రేటుకు రైతులు తమ ధాన్యం ను విక్రయించవద్దు
– దళారీలు ధాన్యం ను కొనుగోలు కేంద్రాలలో రైతుల పేరుతో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
– జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ డి జోయల్ డేవిస్

కల్తీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ డి జోయల్ డేవిస్ హెచ్చరించారు. జిల్లా
సోమవారం సాయంత్రం సిద్ధిపేట రూరల్ మండలం పుల్లూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ డి జోయల్ డేవిస్ తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ ఆస్మికంగా తనిఖీ చేసారు .

ధాన్యం కొనుగోలు ప్రక్రియను సిపి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు , ట్యాబ్ ఎంట్రి , ట్రక్ షీట్ జనరేట్ అంశాలను పరిశీలించారు . ధాన్యం కొనుగోలు నుంచి మిల్ లకు తరలించే వరకు జరుగుతున్న ప్రక్రియ ను కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు . ఈ ప్రాసెస్ లో ఏమైనా ప్రతిబంధకాలు ఉన్నాయా అని నిర్వాహకులను ప్రశ్నించారు . అనంరతం సిపి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు .
ధాన్యం కొనుగోళ్ళు సాఫీగా , పారదర్శకంగా జరుగుతున్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు . ఇతర రాష్ట్రాలు,ఇతర ప్రాంతాలనుండి ధాన్యం ఈ కొనుగోలు కేంద్రాలకు వస్తుందా ? దళారీలు తక్కువ రేటు కు కొని ఎక్కువ రేటుకు ధాన్యం అమ్ముతున్నట్లు మీ దృష్టికి వచ్చిందా అని ప్రశ్నించారు. ఆరు కాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి రైతు మోసపోవద్దని సిపి సూచించారు .

యాసంగిలో వేసే ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి విత్తనాలను లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన అనంతరం తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలన్నారు. ఎవరైనా కల్తీ విత్తనాలు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి దుకాణాల లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాంటి వారి వివరాలు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని రైతులకు సిపి సూచించారు .

రాబోయే యాసంగి సీజన్ లో వరి పంట సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించాలని సిపి సూచించారు . మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తే అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు . భూమి రకం , వాతావరణ పరిస్తితులను బట్టి శాస్త్రవేత్తల సూచించిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు .
ప్రభుత్వ ఆదేశాల మేరకు వానాకాలం ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పోలీస్ శాఖ పని చేస్తుందన్నారు . ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి ధాన్యం మిల్లులకు చేరేంత వరకు జరిగే ప్రాసెస్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సిపి రైతులకు తెలియజేసారు . కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లు లకు పంపాలని సిపి కేంద్ర నిర్వహకులకు సూచించారు.

జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ….
తెలంగాణ లో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి వరి పంటతో బాయిల్డ్ రైస్ మాత్రమే తయారవుతుందని, కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థలు బాయిల్డ్ రైస్ కోనుగోలుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో వరి పంట సాగు శ్రేయస్కరం కాదని అన్నారు. యాసంగి సీజన్ లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే దిశగా రైతు వేదికల్లో వెంటనే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. సమస్యలు ఉన్న , సమస్యలు ఎదురయ్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుర్తించి …. వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేయలన్నారు .
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ సిద్ధిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు .
ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలి : జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
యాసంగి లో వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలి జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గారు కోరారు. ఈ రోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు రైతు వేదికలో గ్రామ రైతులతో సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా ఈ యాసంగి లో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయడానికి fci నిరాకరించడం వలన రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాలని కోరారు. దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నందున ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం లేదు కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరారు. వరికి బదులుగా కూరగాయలు, నువ్వులు, పెసర్లు మినుములు, ప్రొద్దుతిరుగుడు పట్టు పరిశ్రమ, ఆయిల్ఫామ్ లాంటి పంటల్ని వేసుకోవాలని సూచించారు. తక్కువ వ్యవధిలోనే అత్యధిక ఆదాయం పొందవచ్చునని తెలియజేశారు. అపరాలు సాగు చేసినట్లయితే సంవత్సరంలో మూడు పంటలు తీసుకోవచ్చునని పంట మార్పిడి వల్ల భూసారం కూడా పెరుగుతుందని తెలియజేయడం జరిగింది. చెరువు కింద పొలాలు, వరి తప్ప ఇతర పంటలు పండించ లేని పొలాలలో ముందస్తుగా రైస్ మిల్లతో అవగాహన కుదుర్చుకుని లేదా సీడ్ ప్రొడక్షన్ కోసం గాని వేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేశారు. తదుపరి కొంతమంది రైతులు గ్రామంలో కోతులు మరియు అడవి పందుల బెడద తీవ్రంగా ఉందని ఆ సమస్యను పరిష్కారం చేయాలని కోరడం జరిగింది. సుమారు రెండు గంటల సేపు రైతులు అడిగిన ప్రతి ప్రశ్నకు సావధానంగా విని సందేహ నివృత్తి చేయడం జరిగింది. ఇంకా ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, జిల్లా అటవి శాఖ అధికారి శ్రీధర్ రావ్, తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం సైంటిస్టులు విజయ్ మరియు పల్లవి స్థానిక వ్యవసాయ అధికారి పరశురాం రెడ్డి, సెరీ కల్చర్ అధికారి శర్మ, ఏఈఓ స్పందన గ్రామ సర్పంచ్ నరేష్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ లో సిపి , అదనపు కలెక్టర్ వెంట dfo శ్రీధర్ రావు , drdo శ్రీ గోపాల్ రావు , dao శ్రీ శ్రవణ్ , స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు .

Share This Post