కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కుల పంపిణి చేస్తున్న రాష్ట్ర పౌరసరఫరాలు & బి.సి.సంక్షేమ శాఖ మాత్యులు గంగుల కమలాకర్

పేదింటి ఆడపడుచులకు వరం కళ్యాణ లక్ష్మి

ఆడబిడ్డల పెళ్లిళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నయ్యగా అండదండలు

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

187 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
000000

పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి గొప్పవరమని, ఆడబిడ్డల పెళ్లిళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నయ్యగా అండదండలు అందిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో 187 మంది లబ్ధిదారులకు, ఒక్కొక్కరికి ఒక లక్ష నూట పదహార్లు, మొత్తంగా సుమారు రూ. 1,87,21,692 ( ఒక కోటి 87 లక్షల 21వేల 692) రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతములో ఏ ప్రభుత్వము అమలు చేయని విధంగా బడుగు బలహీన వర్గాల వారు తమ ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం అప్పులు చేయకుండా ఉండేందుకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి వారి ఇళ్లలో వెలుగులు నింపుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. 24 గంటల పాటు కరెంటు, తాగునీరు, పేద ఆడపడుచుల కాన్పుల కోసం కేసీఆర్ కిట్లు, ఆడపిల్ల జన్మిస్తే రూ. 13 వేలు, మగ పిల్లవాడు జన్మిస్తే రూ. 12 వేలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కార్పోరేట్ పాఠశాలల్లో చేరి చదువుకోలేని వారికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచిత ఆంగ్ల విద్యను అందిస్తుందని అన్నారు. ఆడబిడ్డలు కంటతడి పెట్టకుండా ఎప్పుడూ నవ్వుతూ జీవించేలా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.

అనంతరం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని కరీంనగర్ అర్బన్ కు చెందిన 115 మంది లబ్ధిదారులకు, కరీంనగర్ రూరల్ కు చెందిన 44 మంది లబ్ధిదారులకు, కొత్తపల్లి మండలం లోని 28 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 1,00,116/- రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. మొత్తంగా 187 మందికి చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, కరీంనగర్ ఎంపీపీ లక్ష్మయ్య, జడ్పిటిసి పురుమల్ల లలిత, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, కరీంనగర్ అర్బన్ తాసిల్దార్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post