కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కుల పంపిణి చేస్తున్న రాష్ట్ర పౌరసరఫరాలు &; బి.సి.సంక్షేమ శాఖ మాత్యులు గంగుల కమలాకర్, పాల్గొన్న నగర మేయర్ వై సునీల్ రావు, సుడ చైర్మెన్ జి వి రామకృష్ణ రావు.

పేదింటి ఆడబిడ్డలకు గొప్పవరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు

బడుగు, బలహీన వర్గాల ఆడబిడ్డలకు మేనమామ ముఖ్యమంత్రి కే.సి.ఆర్

591 మంది కళ్యాణ లక్ష్మి  లబ్ధిదారులకు  రూ. 5 కోట్ల 91లక్షల 43 వేల 556 విలువ గల చెక్కులు పంపిణీ

రాష్ట్ర బీసీ సంక్షేమ,పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

000000

పేదింటి ఆడబిడ్డలకు గొప్పవరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 591 మంది  లబ్ధిదారులకు  5 కోట్ల 91 లక్షల 43వేల 556 రూపాయల విలువ గల  చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆడబిడ్డల వివాహాలకు ఇబ్బంది కలుగకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కే.సి.ఆర్ ఒక మేనమామ లాగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం  ద్వారా 1,00,116/- రూపాయలను అందజేస్తున్నారని అన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్నదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి తెలిపారు. పేదలు  రెక్కడితే గానీ డొక్కాడదు, ఎక్కువ డబ్బు ఉండదని అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పేదింటి ఆడబిడ్డల కోసం  ప్రవేశపెట్టారని తెలిపారు. అలాగే ఆసరా పెన్షన్, వృద్దాప్య పెన్షలను కూడా ప్రవేశపెట్టారని మంత్రి అన్నారు. కరీంనగర్ అర్బన్ మండలంలో  274 లబ్ధిదారుకు  రూ. 2 కోట్ల 74 లక్షల 06 వేల 784 విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను, కొత్తపల్లి మండలంలోని 150 మంది లబ్దిదారులకు రూ. ఒక కోటి 50 లక్షల 17 వేల 400  విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను, కరీంనగర్ రూరల్ మండలంలోని 167 మంది లబ్దిదారులకు  రూ. ఒక కోటి 67 లక్షల 19 వేల 372 విలువ చేసే కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మొత్తంగా రూ. 5 కోట్ల 91 లక్షల 43 వేల 556 విలువ గల చెక్కులను మంత్రి లబ్దిదారులకు అందజేశారు. మాతా శిశు సంరక్షణరక్షణ కేంద్రంలో తొలి కాన్పుకు  కే.సి.ఆర్. కిట్లు ఇస్తున్నామని, మగ బిడ్డ జన్మిస్తే రూ.12 వేలు, ఆడబిడ్డ జన్మిస్తే రూ.13 వేలు అందజేస్తున్నరని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు, సుడా చైర్మన్ జీ.వి. రామకృష్ణా రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు,  కార్పోరేటర్లు, కొత్తపల్లి, కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ మండలాలల తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post