కల్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేస్తున్న రాష్ట్ర పౌరసరఫరాలు & బి.సి.సంక్షేమ శాఖ మాత్యులు గంగుల కమలాకర్.

నిరుపేదలకు వరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
00000
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు వరంగా మారాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం ఎన్నో కొత్త పథకాలు ప్రవేశ పెడుతుందని వాటిని నిరుపేదలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుపేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం వరం లాంటిదన్నారు. అనంతరం కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష నూట పదహారు రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. కొత్తపల్లి మండలానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు కూడా చెక్కులను అందించారు. కరీంనగర్ అర్బన్ మండలానికి చెందిన 164 మంది లబ్ధిదారులకు చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మొత్తం 230 మంది లబ్ధిదారులకు రూ. 2,30,26,680/- విలువగల చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు, వైస్ చైర్మన్ చల్లా స్వరూపరాణి హరీ శంకర్ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎంపీపీ రాణి, ఆర్డిఓ ఆనంద్ కుమార్ తహసీల్దార్లు,కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post