కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండదండగా నిలుస్తుంది కరీంనగర్ కళోత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని జిల్లాల్లో కళోత్సవాల ఏర్పాటుకు కృషి చేస్తా రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు

కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండదండగా నిలుస్తుంది

 

  •  కరీంనగర్ కళోత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని జిల్లాల్లో కళోత్సవాల  ఏర్పాటుకు కృషి చేస్తా
  • రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు

0 0 0 0

 

     

 

    కవులు, కళాకారులకు పుట్టినిళ్లయిన తెలంగాణ రాష్ట్రoలో అజ్ఞాత సూర్యులుగా మిగిలిపోతున్న కళాకారులకు అనుక్షణం అండాదండాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.

 

       కరీంనగర్ లో సెప్టెంబర్ 30 నుండి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న కరీంనగర్ కళోత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు తెలంగాణ కళాకారులం అని చెప్పుకోవడానికి బయపడుతుండే కాలం నుండి, తెలంగాణ యాస బాషను వాడితే చాలు సినిమాలు హిట్టవుతాయి అనే స్థితికి చేరుకున్నామని, ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియాగా మారి భారతదేశం మొత్తం ఆడుతున్నాయని తెలిపారు.  తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్ గారితో పాటు కళాకారులు కలిసి పాల్గోన్నారని అన్నారు.  కళాకారుల సంక్షేమం కొసం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధిని స్థాపించుకొని 574 మంది కళాకారులకు ఉద్యోగాలను కల్పించడం జరిగిందని పేర్కోన్నారు.  సముద్రాన్ని తలపించే జనం మద్య జరుపుకుంటున్న కరీంనగర్ కళోత్సవాలను స్పూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రతి సంవత్సరం  కళోత్సవాలు జరిపించేలా చూస్తానని పేర్కోన్నారు.  కరీంనగర్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  గారికి ఎనలేని అభిమానమని అందుకే తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ నుండే నాంది పలికారని పేర్కోన్నారు.    కార్యక్రమంలో చివరగా  కళాకారులను,  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడంలో కృషిచేసిన అధికారులను, టెక్నిషియన్లను శాలువ మెమోంటో లతో ఘనంగా సత్కరించారు.

      ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, SC కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, యం.ఎల్.సి పాడి కౌశిక్ రెడ్డి,  మానకొండూర్, చోప్పదండి శాసన సభ్యులు రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్ లు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సీపీ వి సత్యనారాయణ, నగర మేయర్ వై సునీల్ రావు, అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, మాజీ  ఎమ్మెల్సీ నారదాసు  లక్ష్మణ్ రావు, మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, సిని నటి రోజారమణి తదితరులు పాల్గోన్నారు.

Share This Post