కళాశాలల్లో , స్కూల్స్ లో పిల్లలకు మరియు టీచర్లకు కోవిడ్ వ్యాక్సిన్ 100 శాతం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి డి ఇ ఓ , ప్రిన్సిపాల్స్ కు ఆదేశించారు

పత్రిక ప్రకటన                                                                    తేది 09.09.2021

 కళాశాలల్లో , స్కూల్స్ లో  పిల్లలకు మరియు టీచర్లకు కోవిడ్  వ్యాక్సిన్ 100 శాతం  పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి డి ఇ ఓ , ప్రిన్సిపాల్స్ కు  ఆదేశించారు.

గురువారం కల్లెక్టరేట్  సమావేశం హాలు లో  కళాశాల ప్రిన్సిపాల్స్  మరియు డి ఇ ఓ  లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకుంటేనే పరీక్షలకు అనుమతిస్తామని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. టీచర్లు అందరు వ్యాక్సిన్ వేసుకొని పాటశాలకు హాజరు కావాలని అన్నారు. జిల్లాలో ఉన్నటువంటి కళాశాలల్లో , స్కూల్స్ లో  ఎంత శాతం హాజరు అవుతున్నారు, బోధన మరియు ఇతర సిబ్బంది ఎంత మంది హాజరు అవుతున్నారు, వివరాలు  అడిగి తెలుసుకున్నారు. ప్రతి కళాశాల లో విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా  చర్యలు తీసుకోవాలని  ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ క్యాంపు ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి , దగ్గరలో ఉన్న పి.ఎచ్.సి లలో వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలని అన్నారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, డి.ఈ.ఓ సిరాజుద్దీన్, డాక్టర్ శశి కళ, ఎం ఏ ఎల్ డి ప్రభుత్వ కళాశాల , నవోదయ , ఎస్.వి.ఎం పి.జి. ఇంటర్మీడియట్ కళాశాలల  ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

You need to add a widget, row, or prebuilt layout before you’ll see anything here. 🙂

Share This Post