కళాశాల స్థాయి ఉపకార వేతనముల పై సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగర్వాల్.

విద్యార్థుల ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్లు వేగవంతంగా పూర్తి చేయాలి

కళాశాల స్థాయి ఉపకార వేతనం లపై సమీక్షా సమావేశంలో

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

0000

జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థుల ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్లను వేగవంతంగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కళాశాల స్థాయి ఉపకార వేతనం లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్, మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలు మొత్తంగా 198 ఉన్నాయని తెలిపారు. ఇందులో 8061 మంది ఎస్సి విద్యార్థులు ఉపకార వేతనాలు పొందుటకు అర్హులని అన్నారు. వీరిలో ఇప్పటివరకు 2491 మంది విద్యార్థులకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అయ్యాయని తెలిపారు. మిగిలిన 5570 విద్యార్థుల రిజిస్ట్రేషన్లను వేగవంతంగా పూర్తిచేయాలని సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్ లకు సూచించారు. వచ్చే నెల డిసెంబర్ 6 న డాక్టర్ బిఆర్. అంబేద్కర్ వర్ధంతి రోజు నాటికి విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు అందేలా కృషి చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. అర్హులైన విద్యార్థులకు బోనఫైడ్ సర్టిఫికెట్ లు, ఆధార్ కార్డు నెంబర్లతో కంప్యూటర్లలో రిజిస్ట్రేషన్ లను ఈనెల 22వ తేదీ లోపు పూర్తిచేయాలని అన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ప్రిన్సిపాల్ లకు సూచించారు. కళాశాలల్లో ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్, స్పోర్ట్స్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థుల చేత శ్రమదానం, హరితహారం తదితర కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎన్ ఎస్ ఎస్ సర్టిఫికెట్ ల వల్ల విద్యార్థులకు పై చదువుల్లో రిజర్వేషన్లు లభిస్తాయని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కరీంనగర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి, ఉపకారవేతనాల రిజిస్ట్రేషన్ల పక్రియ కు సంబంధించి సందేహాలను నివృత్తి చేయాలని సంబంధిత అధికారికి సూచించారు.

ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు పి. నేతనియల్, ఏఎస్ డబ్ల్యు ఓ లు హమీద్, తిరుపతి నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ లు , హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post