కళోత్సవాలతో అజరామరంగా నిలువనున్న కరీంనగర్ కీర్తి రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

   భారత దేశంలోని 20రాష్ట్రాలు, 3 దేశాల కళాకారులతో శుక్రవారం నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న కరీంనగర్ కళోత్సవాలతో కరీంనగర్ జిల్లా ఘనకీర్తి అజరామరంగా నిలువనుందని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

     గురువారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాః బి.ఆర్. ఆంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో కళాకారులతో క్యాంప్ ఫైర్ కార్యక్రమంతో కరీంనగర్ కళోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా కళాత్సవాలలో పాల్గోన్నెందుకు వారి సాంప్రదాయ వస్త్రాలలో నృత్యాలతో వచ్చిన కళాకారులకు మంత్రి పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. శుక్రవారం నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్న కరీంనగర్ కళోత్సవాలు భారత దేశంతో పాటు దేశ విదేశాలను ప్రబావితం చేస్తు నభూతో నభవిష్యతి అన్న చందంగా నిర్వహించుకుందామని, దీనికి ప్రకృతి కూడా తనవంతు సహాకారాన్ని అందించాలని కోరారు. అనంతరం కళాకారులను పరిచయం చేసుకుంటు కలెక్టర్, మేయర్ లను వారికి పరిచయం చేశారు. కార్యక్రమాన్ని మొదటగా జాతీయ గీతంతో ప్రారంభించి, క్రాకర్ షో, అనంతరం క్యాంప్ ఫైర్ గావించి, ఇజ్రాయిల్, అండమాన్ నికోబార్, పంజాబ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, డిల్లి, మద్య ప్రదేశ్, మహరాష్ట్ర, గోవా, మణిపూర్, హర్యాణ లకు చెందిన కళాకారులు వారి సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు.

   జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, పండుగ వాతావరణాన్ని మరిపించేలా నిర్వహిస్తున్న కరీంనగర్ కళోత్సవాలలో రాజకీయాలకు అతీతంగా అందరు బాగస్వాములవ్వడం జరిగిందని పేర్కోన్నారు. ఈ కార్యక్రమం ఇంతే సంతోషాలతో 3 రోజుల పాటు నిర్వహించుకుందామని పేర్కోన్నారు.

     ఈ కార్యక్రమంలో నగర మెయర్ వై. సునీల్ రావు, పోలీస్ కమీషనర్ సత్యనారాయణ, మాజి ఎంఎల్సి నారదాసు లక్ష్మణ్ రావు, డిప్యూటి మేయర్ చల్ల స్వరూపారాణి తదితరుల పాల్గోన్నారు.

Share This Post